News and Entertainment

ప్రియుడిని ప్రేమ‌గా ఇంటికి పిలిచి…ఏంచేసిందో తెలుసా..

loading...


త‌న‌ను ప్రేమించిన‌వాడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్దపడడం తట్టుకోలేకపోయింది ఆ యువతి. తనను మోసం చేసిన యువకునికి ఊహించని శిక్ష వేసింది, వివరాల్లోకి వెళ్లితే…మధ్యప్రదేశ్ లో సిద్ది జిల్లాలోని నౌగవన్ గ్రామంలో నివసిస్తోంది ఓ యువతి (21). ఆమెను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించాడు. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారిద్దరి ప్రేమ అన్ని హద్దులు దాటింది. యువకుడి కుటుంబసభ్యులకు వీరిద్దరి సంబంధం చాలా రోజుల క్రితమే తెలిపింది. అమ్మాయి కులం వేరేది కావడంతో అబ్బాయి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు.

అయితే కొన్ని రోజుల క్రితం గ్రామానికే చెందిన మరో అమ్మాయితో అబ్బాయికి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. యువకుడు కూడా పెళ్లికి ఒప్పుుకున్నాడు. దీంతో ప్రేమించిన అమ్మాయికి తీవ్రంగా కోపం వచ్చింది. జనవరి 23 రాత్రి యువకుడిని తన ఇంటికి పిలిచింది. ప్రేమ నటిస్తూ… అబ్బాయి ప్రైవేట్ పార్ట్ కోసేసింది. ఒక్కసారిగా షాక్ తిన్న యువకుడు అక్కణ్నించి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతుండడంతో కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. వెంటనే వారు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు.