News and Entertainment

షాకింగ్‌ : యాంకర్ సుమ అరెస్ట్.. అసలేమైంది..!


టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సినిమా తీయడంలోనే కాకుండా ప్రమోషన్‌ విషయంలో కూడా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. తను చేసిన ప్రతి సినిమాను చాలా క్రియేటివిటీతో ప్రమోషన్‌ చేసి ప్రేక్షకులకు దగ్గర చేస్తాడు. తాజాగా జక్కన్న ‘బాహుబలి 2’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను ప్రారంభించారు.

శివరాత్రి సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులను ప్రముఖ యాంకర్‌ సుమ ఇంటర్వ్యూ చేసేందుకు రాజమౌళిలో వేసిన ‘బాహుబలి’ సెట్టింగ్‌కు వెళ్లింది. అక్కడ సుమ సరదాగా తన సెల్‌లో ఫొటోలు తీసుకోవడంతో పాటు, సెల్ఫీలు తీసుకుంటుండటంతో ఆమెను బందీకానలో వేశారు. అనుష్కను బంధించిన ఆ సెల్‌లోనే ఆమెను బంధించాడు రాజమౌళి. సరదాగా చేసిన ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తుంది. రాజమౌళిని సుమ ఆ సెల్‌లో ఉండే కొద్ది సమయం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మొత్తానికి జక్కన్న ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే సుమను బొక్కలో వేసి కూడా పబ్లిసిటీ పొందాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Read: