News and Entertainment

భర్తను శృంగారంతో హత్య చేద్దామనుకున్న భార్య .. కానీ


తనతో కాకుండా వేరే మహిళలతో కూడా భర్తకు సంబంధాలున్నాయన్న అనుమానంతో భర్తను చంపడానికి నిర్ణయించుకుంది ఓ భార్య. శృంగార ప్రియుడైన భర్తను శృంగారం ద్వారానే చంపాలని నిర్ణయించుకుంది. అందుకు ఆమె వేసిన ప్లాన్‌ మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది.

కెన్యాకు చెందిన బీట్రస్‌ అనే మహిళ తన భర్త వాకర్‌ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో రగిలిపోతోంది. పెళ్లి అయిన నాలుగేళ్లు కూడా గడవక ముందే వాకర్‌ వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే సమాచారంతో అతనిపై విపరీతమైన ద్వేషం పెంచుకుంది. అతనితో తరచూ గొడవలు పడేది. గత గురువారం అతణ్ని చంపేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన జననాంగానికి అత్యంత ప్రమాదకరమైన విషాన్ని పూసుకుని భర్తను శృంగారానికి ఆహ్వానించింది. బీట్రస్‌తో సరస సల్లాపాల్లోకి దిగితే వాకర్‌ మరణించేవాడే. అయితే శృంగార సమయంలో బీట్రస్‌ శరీరం, జననాంగం నుంచి వస్తున్న వాసనను గమనించి వాకర్‌ అలర్ట్‌ అయ్యాడు. తర్వాత నిజం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన కోర్టు బీట్రస్‌కు పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది. చాలా రోజుల నుంచి తన భార్య చేతుల మీదగా మంచినీళ్లు కూడా తాగడం లేదని, ఆమె తనను చంపాలని ఎప్పట్నుంచో అనుకుంటోందని వాకర్‌ వెల్లడించాడు.

Read