News and Entertainment

జియో మరో బంపర్ ఆఫర్...ఉచిత ఆఫర్ పొడిగింపు...


జియో వినియోగదారులకు శుభవార్త చెప్పనుంది. వినియోదరులకు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లు నియమనిబంధనలకు లోబడే ఉన్నాయని ట్రాయ్ స్పష్టం చేసినట్లు ఢిల్లీ కోర్టుకు తెలిపింది. జియో ఉచిత ఆఫర్లు అడ్డుకోవడంలో ట్రాయ్ విఫ‌ల‌మైందంటూ ప్ర‌ముఖ టెలికాం సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఫిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనికి సంబంధించి టెలికాం డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ అప్పీలేట్ ట్రిబ్యున‌ల్‌లో ఈ నెల 20న వాద‌న‌లు వినాల్సి ఉండంటంగో వొడాఫోన్ పిటిష‌న్‌ను ఫిబ్ర‌వరి 21కి వాయిదా వేసింది కోర్టు.

ఫిబ్ర‌వ‌రి 20న టెలికాం డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ అప్పీలేట్ ట్రిబ్యున‌ల్‌లో జ‌రిగే విచార‌ణ‌లో భాగంగా వెల్‌క‌మ్ ఆఫ‌ర్‌, హ్యాపీ న్యూఇయ‌ర్ ఆఫ‌ర్‌లు రెండు వేర్వేరు ఆఫ‌ర్ల‌ని జియో త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ముందే తెలియ‌జేసిందో లేదో అనేదానిపై ట్రాయ్ స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంది. ఇంట‌ర్ క‌నెక్ష‌న్ యూసేజ్ ఛార్జెస్ అన్ని టెలికాం సంస్థ‌ల‌కు ఒకేలా వ‌ర్తించాల‌ని ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలు ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేద‌ని వొడాఫోన్ త‌న పిటిష‌న్‌లో పేర్కొంది. ఆదేశాలు అమ‌లు చేయ‌డంలో ట్రాయ్ జాప్యం చేస్తుండ‌టంతో త‌మ సంస్థ‌కు భారీ స్థాయిలో న‌ష్టం వాటిల్లుతోంద‌ని వొడాఫోన్ కోర్టుకు తెలిపింది. ట్రాయ్ త‌న రెగ్యులేష‌న్స్‌ను టారిఫ్ ఆర్డ‌ర్ల‌ను వెంట‌నే అమ‌లు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాల‌ని త‌న పిటిష‌న్‌లో వొడాఫోన్ వెల్ల‌డించింది.

దీనిపై జియో వివరణ ఇచ్చింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు లోబడే జియో ఫ్రీ ఆఫర్ ఇస్తున్నామని.. ప్రత్యర్థులు అడ్డుకోవటానికి ఎన్ని కుట్రలు చేసినా.. ఫ్రీ ఆఫర్ కంటిన్యూ చేసి తీరతామని స్పష్టం చేసింది. ఫ్రీ ఆఫర్ కింద ఎలాంి నిబంధనలను ఉల్లంఘించటం లేదని స్పష్టం చేసింది.