News and Entertainment

జియో యూజర్లకు చేదు వార్త చెప్పిన ట్రాయ్‌..


భారత టెలికాం రంగంలో ఉచిత డేటా, కాల్స్ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో యూజర్లకు చేదు వార్త. జియో 4జీ ఇంటర్నెట్ వేగం సగానికి పదిపోయిందని టెలికాం రంగం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది. 4జీ నెట్‌వర్క్‌లో అత్యధిక డేటా బదిలీ చేస్తున్న సంస్థగా ఎయిర్‌ టెల్ తొలిస్థానంలో నిలిచింద‌ని తెలిపింది. ఈ అంశంలో ఎయిర్‌ టెల్ తరువాతి స్థానాల్లో ఐడియా, వొడాఫోన్‌ సంస్థలు ఉన్నాయి. గ‌త ఏడాది డిసెంబర్‌ నెలలో డేటా వేగాల్లో జియో వీటన్నింటి కన్నా ముందు నిలువగా.. ఇప్పుడు తొలిస్థానంలో నిలిచింద‌ని తెలిపింది.

ఈ సంవత్సరం జనవరి నెలకు గాను 11.62 ఎంబీపీఎస్‌ డేటా వేగంతో ఎయిర్‌టెల్‌ అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్‌ జియో డేటా వేగం కేవలం 8.345 ఎంబీపీఎస్‌గా నమోదైంది. అంతకుముందు డిసెంబర్‌లో ఆ సంస్థ డేటా వేగం 18.146 ఎంబీపీఎస్‌గా నమోదు చేసి అన్ని నెట్‌వర్క్‌ల కంటే ముందు స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో జనవరి నెలకు గాను మిగిలిన టెలికాం సంస్థలైన ఐడియా 10.562 ఎంబీపీఎస్‌, వొడాఫోన్‌ 10.301 ఎంబీఎపీఎస్‌ సగటు డేటా వేగాలను నమోదు చేశాయి. మొత్తంగా జియో మినహా మిగిలిన మూడు సంస్థలు డేటా వేగం పెరగ్గా, జియో వేగం దాదాపు సగానికి పడిపోయిందని ట్రాయ్‌ పేర్కొంది.