News and Entertainment

షాకింగ్ న్యూస్: G-Mail ఇక ఉండదట

loading...

2017 డిసెంబర్ కళ్లా..విండోస్ పాత వెర్షన్ లలో గూగుల్‌కు చెందిన G-mail పనిచేయదని చెప్పింది గూగుల్ సంస్థ. ఈ నెల 8 నుంచి క్రోమ్‌ వెర్షన్‌ 53 కంటే ఓల్డ్ వెర్షన్ లలో జీమెయిల్‌ ఓపెన్‌ చేస్తే.. ఇకపై అప్‌డేట్‌ చేసుకోవాలంటూ.. ఓ బ్యానర్‌ కనిపిస్తుందని తెలిపింది. అనంతరం క్రోమ్‌ బ్రౌజర్‌, విండోస్‌కు పాత ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (OS) అయిన XP, Vista సాఫ్ట్ వేర్ లతో నడిచే కంప్యూటర్ లలో కూడా G-mail పనిచేయదని స్పష్టంచేసింది. కస్టమర్ల సైబర్ సెక్యూరిటీల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది గూగుల్ సంస్థ.

క్రోమ్‌ బ్రౌజర్‌ వెర్షన్‌ 55ను కొత్తగా తీసుకొస్తోంది గూగుల్ సంస్థ. ఈ వెర్షన్ లో సైబర్ సెక్యూరిటీకి తావే ఉండదని చెబుతోంది. అలాగే సెక్యూరిటీ ఫీచర్స్ లేని పాత వెర్షన్ లకు అప్ డేట్ సర్వీసులు ఆపేస్తున్నట్టు ప్రకటించింది.

ఇటు మైక్రోసాఫ్ట్‌ తన పాత ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ లు అయిన XP, Vista లకు రెండేళ్ల క్రితమే అప్ డేట్ సర్వీసులను ఆపేసింది. ఇప్పటికీ చాలా మంది ఈ కంప్యూటర్లే వాడుతున్నారు. G-mail వినియోగించాలంటే కొత్త OS, బ్రౌజర్ లలోకి వాడని పరిస్థితి మరి.