News and Entertainment

ఫోన్ టాయ్‌లెట్‌లో పడింది... ఇతనేం చేశాడో తెలిస్తే ఇక అంతే


ఈ రోజుల్లో మనిషి జీవితం లో అత్యంత ముఖ్యమైనది ఏంటని అడిగితే ప్రాణం కన్న ముందు సెల్ ఫోన్ అని చెప్పే రోజులివి. ఆ రేంజ్ లో మనిషి జీవితాలపై సెల్ ఫోన్ ప్రభావితం చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ పిచ్చి ఎలా తయారైందంటే దాని కోసం చచ్చిపోవడం లేదా చనిపోవడం వరకు వెళ్ళింది.

విషయం లోకి వెళితే నార్వేలో ఓ కుర్రాడు సెల్‌ఫోన్ కోసం ఎవరూ చేయలేని పనిచేశాడు. సెల్‌ఫోన్ పొరపాటున టాయ్‌లెట్‌లో పడిపోతే ఎవరైనా ఏం చేస్తారు. ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్న వస్తువు పోయిందే అని బాధపడతారు. వదిలేస్తారు. కానీ టాయ్‌లెట్ ట్యాంక్‌లో..
దిగి ఫోన్ కోసం వెతుకులాడరు కదా. కానీ నార్వేలోని డ్రామెన్ మాత్రం అందరిలా ఫోన్ పోతే వదిలేయలేదు. టాయ్‌లెట్ ట్యాంక్‌లో దిగి దాని కోసం వెతుకులాడాడు. తిరిగి పైకొచ్చే క్రమంలో ఇరుక్కుపోయాడు.

చివరకి నానా తంటాలు పడి గంట తరువాత బయటికి వచ్చాడు. ఆ గంట సేపు మాత్రం ఆ కంపు భరించలేక నరకం చూశానని చెప్పాడు.ఆ ట్యాంక్ సంవత్సరం నుంచి శుభ్రం చేయలేదని అతను తెలిపాడు. ఒళ్లంతా కంపు కొడుతుందని, తనకు కొంత విశ్రాంతి కావాలని... జీవితంలో టాయ్‌లెట్‌ ట్యాంక్‌లోకి వెళ్లనని చెప్పాడు. లోపల పాములు, జర్రులు కూడా ఉన్నాయని డ్రామెన్ చెప్పాడు. ఇంత చేసినా అతనికి ఫోన్ మాత్రం దొరకలేదు. అది అతని ఫోన్ కూడా కాదు. తన ఫ్రెండ్ సెల్ ఫోన్. మరి ఇంత సినిమా జరిగాక తన ఫ్రెండ్స్ ఊరుకుంటారా.. పేస్ బుక్ లో అతనిని ఆటపట్టించడం మొదలెట్టారు.