News and Entertainment

బద్దలు కానున్న అతిపెద్ద డ్యాం.. ప్రమాదంలో భారతీయులు..


'ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు' అన్న ది నిజమో కాదో గానీ, కొందరి స్వార్థ ప్రయోజ నాలు, నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం తదితరాల కారణంగా ప్రమాదఘంటికలు మో గిస్తున్నాయి.
ఉత్తర కాలిఫోర్నియా సమీపాన గల ఫెదర్‌ నది పై నిర్మించిన వోవర్‌ విల్లే డ్యామ్‌ ప్రమాదం అంచున కొట్టుమిట్టాడుతోంది. మా నవ నిర్మిత వోవర్‌ విల్లే సరస్సుకు అనుసం ధానంగా ఉన్న ఈ డ్యామ్‌కు శనివారం అర్ద రాత్రి నుంచి అనూహ్యంగా వరద నీటి ప్రవా హం తీవ్రస్థాయిలో చేరుతుండటంతో భారీగా పొంగి పొర్లుతోంది. కాగా, 1968 సంవత్సరంలో అందు బాటులోకి వచ్చిన ఈ డ్యామ్‌ వచ్చే ఏడు గోల్డెన్‌ జూబ్లీలోకి (50 వసంతాలు) అడుగు పెడుతున్న సమయాన ప్రమాదకర పరిస్థితుల కు చేరుకోవడం గమనార్హం.

రాళ్ళు ఉన్నాయని కూడా..గమనించలేదు
ఏళ్ల తరబడి కరువు తర్వాత ఇటీవల కాలి ఫోర్నియాలో ఏకబిగిన కురిసిన హిమపాతం, వర్షాలు కారణంగా వోవర్‌ విల్లే డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఐతే, డ్యామ్‌ పర్యవేక్షణ అధికారులు ఈ విషయాన్ని మొదట అంత సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తుంది. భారీవరద ప్రవాహం కారణంగా డ్యామ్‌ కెపాసిటీకి మించి సెకనుకు లక్ష క్యూబిక్‌ అడుగుల మేరకు నీటిని స్పిల్‌వే నుంచి వదులుతున్నారంటే అధికారులు ఎంత ముందు జాగ్రత్తతో ఉన్నారో అంచనా వెయ్యవచ్చు. ఇంత భారీగా నీరు ప్రవహిస్తుండటంతో స్పిల్‌ వే సైతం కోసుకు పోయే పరిస్థితి దాపురిం చింది. ఇక దిక్కు తోచని అధికారులు డ్యామ్‌ ఏ క్షణాన్నైనా బద్దలు కావొచ్చనే హెచ్చరికలు జారీ చేసి సుమారు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు హుటాహుటిన తరలించారు. అత్యంత బాధాకర విషయమేం టంటే, స్పిల్‌వేలో భారీగా రాళ్లు ఉండటంతో నీరు వేగంగా వెళ్లటంలేదని, అందుకే పరిస్థితి విషమించిందని నిపుణులు పసిగట్టేవరకు సదరు అధికారులకు తెలియకపోవడం విచిత్రం. వరద ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న ఇక్కడి వారు తమ బంధువులు ఎలా ఉన్నారో అని ఆందోళన చెందుతు న్నారు. చరిత్రలో జరిగిన కొన్ని డ్యామ్‌ ప్రమాదాలు