News and Entertainment

బ్రేకింగ్:సిమ్‌ కోసం ఫ్రూఫ్స్‌ ఇస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి



టెలికాం రంగంలో ఉన్న పోటీతో ఒకదానికి మించి మరోటి ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఐడియా తీసుకుంటే ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ తీసుకుంటే జియో ఇలా ఒకదాన్ని మించి ఒకటి ఆఫర్లు ఇస్తుండటంతో సామాన్యులు టెంమ్ట్‌ అయ్యి లెక్కకు మించిన సిమ్‌లు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రోజులు ఆ కొత్త సిమ్‌ను వాడటం ఆ తర్వాత పక్కకు పడేయడం జరుగుతుంది. సిమ్‌ కోసం ఎక్కడ పడితే అక్కడ ఐడీ ఫ్రూఫ్స్‌ మరియు ఫొటోలు ఇచ్చేస్తున్నారు. ఇలా డీలర్ల వద్దకు వెళ్లిన ఐడీ ఫ్రూఫ్స్‌ మరియు ఫొటోలు మిస్‌ యూజ్‌ అవుతున్నాయి.

ఒక్క ఐడీ ఫ్రూఫ్‌ వినియోగదారుడి వద్ద తీసుకుని దాన్ని కాపీలు చేయించి, సిమ్‌లను ఇతరులకు ఐడీ ఫ్రూఫ్‌ లేకుండానే ఇచ్చేస్తున్నారు. మామూలుగా అయితే సిమ్‌కు 50 నుండి 100 రూపాయలు ఉంటుంది. కొన్ని కంపెనీలు ఫ్రీగానే సిమ్‌లు ఇచేస్తున్నాయి. అయితే డీలర్లు ఫ్రూఫ్‌ లేకుండా సిమ్‌లు ఇస్తామంటూ, వారి వద్ద 500 నుండి వెయ్యి వరకు వసూళ్లు చేస్తున్నారు. అలా తీసుకున్న సిమ్‌లతో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు.

నేరాలకు పాల్పడ్డ నెంబర్‌ ఎంక్వౌరీ చేసినప్పుడు ఏ సంబంధం లేని వ్యక్తి ఆ నేరంలో ఇరుకుంటాడు. అందుకే సిమ్‌ కొనుగోలు చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. నేరుగా కంపెనీ షోరూంలో అయితే ఉత్తమం. మద్యవర్తి లేదా డీలర్ల వద్ద ఐడీ ఫ్రూప్‌లను ఇచ్చినట్లయితే వారు వాటిని వేరే వారికి కూడా సిమ్‌ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. అందుకే ఇకపై సిమ్‌ కోసం ఐడీ ఫ్రూఫ్స్‌ ఇచ్చేప్పుడు కాస్త జాగ్రత్త పడండి.