News and Entertainment

నాకంటే మెగాస్టారే బెస్ట్ అనిపిస్తుంది: ఎన్టీఆర్



బల్లాల దేవా రానా నటించిన ఘాజీ సినిమా హిందీ వెర్షన్ కు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఇక్కడ ఎవరు? అనుకున్నపుడు చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్ల పేర్లు ఆలోచనకు వచ్చాయి. ఎన్టీఆర్ బేస్ వాయిస్ సూపర్ గా వుంటుంది. అదే విషయమై వార్తలు కూడా వినవచ్చాయి. కానీ ఇప్పుడు అసలు సీన్ వేరుగా వుంది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఘాజీ విడుదలవుతోంది. దీని వెనుక ఎన్టీఆర్ సెంటిమెంట్ దాగి వుందని తెలుస్తోంది. వాయిస్ ఓవర్ చెప్పమన్న రిక్వెస్ట్ ను ఎన్టీఆర్ సున్నితంగా నిరాకరించినట్లు వినికిడి. తను వాయిస్ ఓవర్ చెప్పిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదని, అందువల్ల తనకు ఇష్టం లేదని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. తన వల్ల ఒకరికి మంచి జరగాలన్నదే తన అభిమతమని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఆ సినిమాకి మెగాస్టార్ వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంటుందని కూడా తారక్ చూసించాడట. దీంతో సాటి హీరోకి మంచి జరగాలని కోరుకునే తత్వం తమ అభిమాన హీరోకి మాత్రమే దక్కుతుందని తొడగొట్టి మరీ చెప్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.