News and Entertainment

దారుణం.. హైదరాబాద్‌లో వివాహితపై రేప్‌

loading...

ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఆడవారిపై రేప్‌లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఒక వివాహితపై రేప్‌కు తెగబడ్డారు ఇద్దరు దుండగులు. పండుగకు వెళ్లిన వివాహితకు ఆమె భర్త నుండి అర్జంట్‌గా రావాల్సిందిగా కాల్‌ వచ్చింది. దాంతో ఆమె రాత్రి 9 సమయంలో మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ వద్దకు బస్‌ కోసం అని చేరుకుంది. ఈ సమయంలోనే అక్కడకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, మీ భర్త మమ్ములను పంపించాడు అని బైక్‌ ఎక్కించుకున్నారు.


సంవత్సరం బాబు ఉన్న ఆమెను ఎక్కించుకుని నగర శివారు ప్రాంతంకు తీసుకు వెళ్లడం జరిగింది. అక్కడ బాబు కావాలంటే మా కోర్కె తీర్చాలని వారు బెదిరించారు. ఎంతగా ప్రతిగటించినా కూడా ఆమెపై ఒకరి తర్వాత ఒకరు రేప్‌కు పాల్పడ్డారు. వారిద్దరు కూడా ఆమె వద్ద ఉన్న డబ్బు మరియు నగలు, ఫోన్‌ను తీసుకుని అక్కడ నుండి వెళ్లి పోయారు. ఆ తర్వాత ఆమె ఏదోలా భర్తను చేరుకుని ఆయన సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు విచారణ మొదలు పెట్టారు.