News and Entertainment

టాప్ హీరోయిన్ గుట్టు ర‌ట్టు చేసిన డ్రైవ‌ర్‌


ఓ టాప్ హీరోయిన్ గుట్టును, ఆమె త‌న ల‌వ‌ర్‌తో చేసిన ర‌చ్చ ర‌చ్చ సీన్లు మీడియాకు లీక్ అయిపోయాయి. దీంతో ఆ టాప్ హీరోయిన్ షాక్ అయిపోయింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఆమె ఎంతో సీక్రెట్‌గా ల‌వ‌ర్ల‌తో చేసిన గ‌ప్ చుప్ వ్య‌వ‌హారాలు సైతం బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో ఇప్పుడు ఆమె అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే అందాలభామ కత్రినాకైఫ్.. తన డ్రైవర్ చేతిలో బందీ అయింది.

బందీ అంటే మీరనుకుంటున్నట్టు ఆ డ్రైవర్ కత్రినాను కిడ్నాప్ చేశాడని కాదు. కత్రినాకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలన్నీ ఆమె డ్రైవర్ గుప్పిట్లో ఉన్నాయి. సాధారణంగా, సెలబ్రిటీల రహస్యాలన్నీ వారు ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా ఎలా లీక్ అవుతాయో ఎవ్వ‌రికి తెలియ‌దు.

ఈ నేప‌థ్యంలోనే క‌త్రినా సీక్రెట్ల‌న్ని మీడియాకు వ‌రుస‌గా లీక్ అయిపోతున్నాయ‌ట‌. దీని మీద దృష్టి పెట్టిన క‌త్రినాకు ఓ విష‌యం ఆల‌స్యంగా తెలిసంది. రణబీర్‌తో తన ప్రేమాయణం, రొమాన్స్, విదేశీ టూర్లు, సహజీవనం, చివరకు బ్రేక్ అప్.. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు బయటకు పొక్కాయి.


ఇదంతా ఎలా జరుగుతుందో అటు కత్రినాకు, ఇటు రణబీర్‌కు మొత్తంగా సినీ ప్రేమికులకు అర్థం కాని రహస్యంగానే ఉండిపోయింది. అయితే, తన డ్రైవరే ఈ రహస్యాలన్నింటినీ మీడియాకు చేరవేశాడని కత్రినాకు తెలిసిందట. ఈ విషయం తెలిసి త‌న కారు డ్రైవ‌ర్‌పై నానా హంగామా చేస్తూ విరుచుకుప‌డింద‌ట‌.