News and Entertainment

దేవుడు గొప్పా సింహం గొప్పా అని విర్రవీగిన ఈ చర్చ్ పాస్టర్ ని సింహాలు ఏం చేసాయో చూడండి


దేవుడు గొప్పా.. సింహం గొప్పా? అని తర్కం వెతకొచ్చు గానీ.. ప్రయోగానికి దిగితే సింహం వేటాడి కండలు పీకుతుంది! ఇలాగే జరిగింది ఓ క్రైస్తవ మతగురువుకు! దక్షిణాఫ్రికాలోని జియాన్‌ క్రిస్టియన్‌ చర్చి పాస్టర్‌ అలెక్‌ ఎండివాన్‌.. సహ పాస్టర్లతో క్రూగర్‌ నేషనల్‌ సఫారీ పార్కు సందర్శనకు వెళ్లాడు. అక్కడున్న సింహాల గుంపును చూసి.. దేవుడే వాటినుంచి తనను రక్షిస్తాడంటూ 'దేవుడు గొప్పో.. ఆ సింహాలు గొప్పో' తేల్చేస్తానని సహచరులతో గొప్పలకుపోయాడు.

బుద్ధిగా వేటను తింటున్న సింహాలను రెచ్చగొట్టేలా 'దేవుడా నువ్వే గనక ఉంటే... ఈ సింహాల గుంపు నన్నేం చేయబోవుగాక' అంటూ కేకలు పెట్టాడు. ఆ కేకలతో రెచ్చిపోయిన మృగరాజులు.. ఎండివాన్‌ వైపు ఉరికొచ్చాయి. ఆ భీకర గుంపును చూసి హతాశుడైన మతగురువు 'దేవుడా' అంటూ పరుగందుకున్నాడు. కానీ, పాపం.. సింహాల వేగం ముందు అతడి పరుగు సరిపోక దొరికిపోయాడు. సింహాల వాడి పంజా దెబ్బలకు అతడి పిరుదులు ఛిద్రమయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. అయినా సరే.. 'బహుశా.. జంతువులపై దేవుడు తన ఆధిపత్యాన్ని చాటిచెప్పేందుకే నన్ను వాడుకుని ఉంటాడు' అని ఎండివాన్‌ సమర్థించుకుంటున్నాడు.