News and Entertainment

‘బాహుబలి-2’ పూర్తి స్టోరీ లీక్.. చదివితే షాక్ అవ్వాల్సిందే!

loading...

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి-ది కన్‌క్లూజన్’కి సంబంధించి ఇంటర్నెట్‌లో ఎన్నో కథలు లీకయ్యాయి. ఈ సినిమా కథే ఇదేనంటూ నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు తాజాగా మరో కథ వెలుగులోకి వచ్చింది. ఇదే సినిమా కథ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆ కథేంటో తెలుసుకుందామా.

‘‘బాహుబలి’ని తానే చంపానని సస్పెన్స్‌కి తెరదించుతూ శివునికి కట్టప్ప కథ చెప్పడం మొదలుపెటడతాడు. కాలకేయుడ్ని చంపిన తర్వాత ‘బాహుబలి’ మాహిష్మతి రాజ్యానికి రాజు అవుతాడు. అయితే.. భళ్ళాలదేవుడి తండ్రి అయిన బిజ్జలదేవుడు దీన్ని జీర్ణించుకోలేకపోతాడు. అప్పటివరకు బాహుబలిపై ఉన్న తన అసహ్యాన్ని మరింత పెంచుకుంటాడు. భళ్లాలదేవుడు కూడా తన అధికారం దక్కలేదన్న కోపంతో రగిలిపోతుంటాడు. దీంతో.. తండ్రీకొడుకులిద్దరూ బాహుబలిని అంతమొందించేందుకు సీక్రెట్‌గా ప్లాన్ చేస్తుంటారు. ఎలాగైనా రాజ్యాన్ని తమ చేతికి దక్కించుకోవాలన్న ఆకాంక్షతో రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు.

కట్ చేస్తే.. ఓ సందర్భంలో కుంతల సామ్రాజ్యానికి రాణి అయిన దేవసేన(అనుష్క)ని చూసి బాహుబలి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతడ్ని ప్రేమిస్తుంది. అటు.. భళ్ళాలదేవుడు కూడా దేవసేనని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న బిజ్జలదేవ వెంటనే కుంతల రాజుకి ఓ రాయబారం పంపుతాడు. భళ్ళాలదేవుడితో దేవసేన వివాహం జరిపించాలని అందులో కోరుతాడు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. ఇదే సమయంలో బాహుబలి, దేవసేన ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలుస్తుంది. అప్పుడు భళ్ళాలదేవుడికి న్యాయం చేయాలని కోరుతూ శివగామిపై బిజ్జలదేవుడు ఒత్తిడి తెస్తాడు.

ఆ కారణంగా మాహిష్మతి రాజ్యం, దేవసేననలలో ఒకరినే ఎంచుకోవాలని బాహుబలికి శివగామి ఆజ్ఞాపిస్తుంది. దేవసేన ప్రేమమైకంలో పూర్తిగా మునిగిపోయిన బాహుబలి.. మాహిష్మతి రాజ్యాన్ని భళ్ళాలదేవుడికి అప్పగించి.. దేవసేనతో ఓ అడవికి వెళ్లిపోతాడు. అక్కడ వీరిద్దరూ సంతోషంగా తమ దాంపత్య జీవితాన్ని గడుపుతుంటారు. మరోవైపు.. కాలకేయ తమ్ముడు నింజా (చరణ్‌దీప్) తన భారీ సైన్యంతో మాహిష్మతి రాజ్యంపై దండెత్తుతాడు. దీంతో.. మాహిష్మతి రాజ్యం చిన్నాభిన్నమవుతుంది. ఇక తాము తమ రాజ్యాన్ని కోల్పోతున్నామని శివగామి భావించి.. సహాయం కోసం తిరిగి బాహుబలిని పిలిపిస్తుంది.

బాహుబలి వెంటనే రంగంలోకి దిగి, నింజా సైన్యాన్ని ముచ్చెమటలు పట్టిస్తాడు. మరోవైపు.. ఇదే తమకు అదును అని భావించి బాహుబలిని చంపేందుకు బిజ్జలదేవుడు, భళ్ళాలదేవ ఓ ప్రణాళిక రచిస్తారు. రాజు మాటకి కట్టుబడి ఉండే కట్టప్పని ‘బాహబలి’ని చంపమంటూ ఆ ఇద్దరూ ఆదేశిస్తారు. వారి ఆజ్ఞ మేరకు బాహుబలిని కట్టప్ప చంపేస్తాడు. అప్పుడు శివగామి బాహుబలి కొడుకుని కాపాడుతుంది. ఇక్కడితో ఫ్లాష్‌బ్యాక్ ముగుస్తుంది. కట్టప్ప చెప్పిన ఈ కథ విని.. భళ్ళాలదేవుడిని చంపాలని శివుడు డిసైడ్ అవుతాడు. కుంతల సామ్రాజ్యంతో చేతులు కలిపి.. అతనిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో భళ్ళాలదేవుడ్ని దేవసేన చంపేసి, తన ప్రతీకారం తీర్చుకుంటుంది’’.

ఇదే ‘బాహుబలి-2’ సినిమా కథ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి.. కథ ఇదేనా? కాదా? అని తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు అంటే వచ్చే ఏప్రిల్ 28వ తేదీ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

మోస్ట్ వైరల్ న్యూస్