News and Entertainment

సన్నీ లియోన్ తో బాలయ్య రొమాన్స్

loading...సన్నీలియోన్.. బాలీవుడ్ నటిగా మారిన ఈ పోర్న్ సినిమాల నటి అంటే యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే పోర్న్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఆమె క్రమంగా బాలీవుడ్ లో నెగ్గుకురాగలుగుతున్నారు. యూత్ లో ఆమెకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు దక్షిణాది నిర్మాతలూ ప్రయత్నాలు చేశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు.

గతంలో మంచు మనోజ్ ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు ఏకంగా సన్నీలియోన్ బాలయ్య సరసన నటించబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. బాలయ్య వందో సినిమాలో సన్నీ లియోన్ రు ఛాన్స్ దక్కిందట. బాలయ్య తన వందో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక కథతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

దర్శకుడు క్రిష్ అంటే సహజంగా కథను నమ్ముకునే దర్శకుడు. మరి అలాంటి దర్శకుడి సినిమాలో సన్నీకి అవకాశం ఎలా దొరికిందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఐతే.. కథాపరంగా అవకాశం ఉండటం వల్లే సన్నీలియోన్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న విషకన్య పాత్ర ఉందట. దాని కోసం సన్నీని ఎంపిక చేశారట. 

మొత్తానికి సన్నీలియోన్ లక్కీ గాళ్ అనుకోవాలి. కేవలం స్కిన్ షో కోసం కాకుండా కథాపరంగా గుర్తింపు ఉన్న అవకాశం అందులోనూ క్రిష్, బాలయ్య వంటి ఘనాపాఠీల వద్ద దొరకడం అంటే సాధారణ విషయం కాదు కదా. చూడాలి క్రిష్ ఈ విషకన్య పాత్రను ఎలా తీర్చిదిద్దుతాడో.. ఇది ఇటు బాలయ్య అభిమానులకూ.. అటు సన్నీలియోన్ ఫ్యాన్స్ ఇద్దరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే వార్తే.